మహిళపై అత్యాచారం.. భర్తను వదిలిపెట్టాలని ఒత్తిడి

4 Sep, 2021 17:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌: తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ తనపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళపై పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ అక్షయ్ భర్వాద్ అనే  యువకుడు నాలుగేళ్ల పాట్లు ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. ఆ యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకొని మూడేళ్లు గడుస్తోంది. అయితే ఒక నెల క్రితం ఆ మహిళ తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ ఒత్తిడి చేయడంతో కలుసుకుంది.

ఇద్దరు కలిసి పలు దర్శనీయ ప్రాంతాలు సందర్శించారు. అయితే ఆ సమయంలో​నే తనపై అక్షయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్తను విడిచిపెట్టి తనతో జీవించాలని ఆమెను ఇబ్బందలకు గురిచేశాడు. ఆమెను హోట్‌ల్‌కు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాదు. దీంతో ఆమె ప్రతిఘటించగా..  బలవంతంగా ఆమెతో విషంగా తాగించి, తాను కూడా విషం తాగాడు.

చదవండి: ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను..

అనంతరం అక్షయ్ తన స్నేహితులకు ఫోన్‌ చేయడంతో.. ఇద్దరినీ స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మహిళ.. అక్షయ్‌ తనపై అత్యాచారం, హత్యాయత్నం చేసినట్లు సోలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు అక్షయ్‌ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొనారు.

చదవండి: మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్‌ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు