బంజారాహిల్స్‌లో దారుణం.. యువతిపై అత్యాచారం

8 Aug, 2022 11:05 IST|Sakshi

బంజారాహిల్స్‌: పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. అస్సామ్‌ రాష్ట్రానికి చెందిన యువతి(22) బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 5లోని దేవరకొండ బస్తీలో అక్కాబావల వద్ద ఉంటూ ఓ మలీ్టఫ్లెక్స్‌లో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో పనిచేస్తోంది.

అదే రాష్ట్రానికి చెందిన చిన్మయ్‌ సైకియా(24) అనే యువకుడు కూడా అదే ప్రాంతంతో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఓ షాపింగ్‌ మాల్‌లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న యువతి తన గదిలో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన చిన్మయ్‌ సైకియా లోనికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి తీవ్రంగా ఏడుస్తూ ఇంట్లోనే ఉంటోంది. శనివారం రాత్రి బాధితురాలి సోదరి ఏంజరిగిందని ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో బాధితురాలితో కలిసి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు