రెండేళ్లు కాపురం చేసి... భార్య గర్భవతి అయ్యాక వదిలేసిన భర్త..

8 Aug, 2022 10:02 IST|Sakshi

ఒడిశా: ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసిన అనంతరం తనను వంచించారని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధితురాలు కె.దీపికా కొడుకుతో సహా తనను విడిచి పెట్టిన భర్త దినేష్‌ ఇంటి ఎదుట గత 5 రోజులుగా న్యాయం పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భరంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ 2020లో బరంపురం లోని దేశీబెహరా వీధికి చెందిన దినేష్‌ తను ప్రేమించి, వివాహం చేసుకున్నాడని తెలిపారు. 

రెండేళ్లు కాపురం చేసి, గర్భం దాల్చన అనంతరం విడిచి పెట్టినట్లు వాపోయారు. అప్పటి నుంచి లంజిపల్లిలోని తల్లితండ్రుల వద్ద తల దాచుకుంటూ కొడుకుకి జన్మనిచ్చాన్నారు. ప్రస్తుతం తన కుమారుడికి ఏడాది కావస్తోందని, భర్త మాత్రం మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దినేష్‌ ఇంటి వద్దకు చేరుకొని, తనకు న్యాయం చేయల్సిందిగా కొడుకుతో సహా పగలు, రాత్రి నిరీక్షిస్తున్నట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తల్లీ, బిడ్డకు రక్షణకు సిబ్బందిని నియమించారు. 

మరిన్ని వార్తలు