ఆరుగురిపై వేధింపుల కేసు నమోదు

1 Jul, 2021 14:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బోయినపల్లి(కరీంనగర్‌): అదనపు కట్నం వేధింపులు భరించలేక బోయినపల్లిలో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చింతలఠాణాకు చెందిన మల్లయ్య కూతురు మాధవి(30)తో బోయినపల్లికి చెందిన అలువాల శ్రీనివాస్‌కు 15 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.5.50 లక్షల కట్నం ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా అదనపు కట్నం కావాలని వేధించడంతో తండ్రి మల్లయ్య భూములు ముంపులోపోతే వచ్చిన డబ్బు రూ.5.75 లక్షలు, 10 తులాల బంగారం ముట్టజెప్పారు.

కాగా కొద్దినెలలుగా సిరిసిల్లలో మాధవి తండ్రి మల్లయ్యకు ఉన్న 10 గుంటల భూమిలో 5 గుంటలు కావాలని లేదంటే రూ.20 లక్షలు అదనపు కట్నం తేవాలని మాధవిని భర్త శ్రీనివాస్, అత్త లచ్చవ్వ, ఆడబిడ్డలు రాజేశ్వరి, అంజవ్వ, రాధ, రాజయ్య తదితరులు వేధిస్తున్నారు. 5 గుంటల భూమి లేదా రూ.20 లక్షలు తేవాలని లేదంటే చనిపోవాలని వేధించడంతో మృతిచెందిందని ఆమె తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాధవి భర్త శ్రీనివాస్, అత్త లచ్చవ్వతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి వివరించారు.   

చదవండి: నా పిల్లలతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు