వివాహమై 15 ఏళ్లు.. భార్యపై అనుమానం రావడంతో...

21 Jul, 2021 08:54 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న ఎస్సై వెంకటేశ్వర్‌

సాక్షి, కాల్వశ్రీరాంపూర్‌(కరీంనగర్‌): కాల్వశ్రీరాంపూర్‌ పెద్దచెరువు సమీపంలో మంగళవారం ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్వప్న మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన దాంపల్లి లక్ష్మి కూతురు స్వప్నను ఓదెల మండలం గుంపులకి చెందిన ఆరెపల్లి నరసమ్మ కుమారుడు బాపురావుతో 15ఏళ్ల క్రితం వివాహమైంది.

కొంతకాలంగా స్వప్నపై భర్త బాపురావు అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్నాడు. కాగా సోమవారం గుంపులకి వెళ్లి ఇద్దరికి సర్ది చెప్పామని ఇంతలోనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు రమేశ్‌ వాపోయాడు. పోస్టుమార్టం కోసం శవాన్ని సుల్తానాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. మృతురాలికి కూతురు సిరివెన్నెల(14), కుమారుడు కౌశిక్‌(11) ఉన్నారు 

మరిన్ని వార్తలు