పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో

30 Aug, 2021 07:54 IST|Sakshi

ఆదిలాబాద్‌ రూరల్‌: మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని మొలాలగుట్టకు చెందిన ఆత్రం మోతిబాయి (21) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సై అంజమ్మ తెలిపారు. ఆమె కథనం ప్రకారం... మొలాలగుట్టకు చెందిన నాగోరావ్‌తో గాదిగూడ మండలం పర్సువాడ గ్రామానికి చెందిన మోతిబాయికి గతేడాది వివాహమైంది. ఇటీవల రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంది. రెండు రోజుల కిందట భర్త ఇంటికి వచ్చింది. తాను పుట్టింటికి వస్తానని, తనను తీసుకెళ్లేందుకు తమ్ముడిని పంపించాలని తల్లితో ఫోన్‌లో కోరింది.

రెండు రోజుల కిందటనే వెళ్లావు కదా ఇంకెందుకు వస్తావ్‌ అని తల్లి పేర్కొంది. దీంతో మోతిబాయికి ఆమె భర్త నాగోరావ్‌ మధ్య చిన్నప్పటి గొడవ జరిగింది. దీంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.30 గంటలకు మృతి చెందింది. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు