సహజీవనం: నడిరోడ్డుపై కాల్చి పడేసి..

28 Sep, 2020 10:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళను గన్‌తో కాల్చి రోడ్డుపై పడేసిన ఘటన ఢిల్లీ శివార్లలోని అలీపూర్‌ ప్రాంతంలో వెలుగుచూసింది. డీసీపీ గౌరవ్‌ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 'లాహోరీ గేట్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న సందీప్‌ దహియా భార్యతో విడిపోయాడు. ఈ క్రమంలో అతను మరో మహిళతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. వీరివురు ఆదివారం రోజున కారులో ప్రయాణిస్తుండగా వారి మధ్య ఓ విషయంలో వివాదం తలెత్తింది.  (హేమంత్‌ హత్యకేసు.. పోలీసుల పిటిషన్‌)

దీంతో ఆమెను గన్‌తో కాల్చి రోడ్డు మీద పడేసి వెళ్లిపోయాడు. అయితే ప్రాణాపాయస్థితిలో ఉన్న మహిళను ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మరో సబ్ ఇన్స్పెక్టర్ జైవీర్‌ ఓ ప్రైవేట్‌ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఎస్సై జవీర్‌ వెంటనే స్పందించడం వల్లే ఆమె ప్రాణాలతో బయటపడింది. ఎస్సై సందీప్‌ దహియా తనపై కాల్పులు జరిపినట్లు ఆమె చెప్పింది. దీంతో ఎస్సై సందీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాం' అని డీసీపీ తెలిపారు. (వివాహేతర సంబంధం: మెడలో చె‍ప్పులతో)

మరిన్ని వార్తలు