విశాఖలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

30 Jan, 2023 19:11 IST|Sakshi
సౌజన్య(ఫైల్‌)

సింహాచలం(విశాఖపట్నం): సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెందుర్తి మండలం దువ్వుపాలెంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ అప్పారావు తెలిపిన వివరాలివీ.. హైదరాబాద్‌కు చెందిన సౌజన్య(26)కి, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హనుమంతు గిరిప్రసాద్‌తో 8 నెలల కిందట వివాహం జరిగింది. మూడు నెలల కిందట వీరు దువ్వుపాలెంలో ఇళ్లు కొనుగోలు చేసి నివసిస్తున్నారు.

గిరిప్రసాద్‌  నగరంలోని ఓ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సౌజన్య అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం ద్వారా విధులు నిర్వర్తిస్తోంది. వీరి వివాహం సమయంలో సౌజన్య తండ్రి విష్ణు.. గిరిప్రసాద్‌కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం ఇచ్చారు.
చదవండి: నెత్తుటి మరక.. అతనొక మానసిక రోగి

అయినా తరచూ డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్‌ గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం గిరిప్రసాద్‌ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని ఉంది. ఈ విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసి సీఐ అప్పారావు, ఎస్‌ఐ సురేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు