26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’

10 Apr, 2021 19:44 IST|Sakshi
భార్యపై కత్తితో దాడి చేస్తోన్న హరీశ్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

ఢిల్లీలో చోటు చేసుకున్న దారుణం

నడిరోడ్డుపై భార్య మీద కత్తితో దాడి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి భార్యపై అమానుషంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. కాపాడ్డానికి ప్రయత్నించిన వారిని దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుంది అంటూ హెచ్చరించాడు. దాంతో జనాలు చూస్తూ నిలబడి పోయారు. ఆ వివరాలు. ఢిల్లీకి చెందిన హరీశ్‌, భార్యతో కలిసి బుధ్‌ విహార్‌ ప్రాంతంలో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే గత కొద్ది రోజులుగా అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించసాగాడు.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య దీనికి సంబంధించి వివాదం రాజుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరీశ్‌.. భార్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భర్త నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది. ఆమెను వెంబడించిన హరీశ్‌.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. సుమారు 26 సార్లు భార్యను కత్తితో పొడిచాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. దాంతో హరీశ్‌ ‘‘దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుందని’’ హెచ్చరిస్తూ.. తన దుశ్చర్యను కొనసాగించాడు. భార్య మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేశారు. 

చదవండి: దారుణం: భార్యను పొడిచి, ఆపై కారుతో...

మరిన్ని వార్తలు