వివాహేతర సంబంధం.. ప్రియుడితో గొడవ.. ఇంతలోనే..

24 Nov, 2021 06:49 IST|Sakshi
రాజేశ్వరి (ఫైల్‌)

శిడ్లఘట్ట(కర్ణాటక): పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్‌లో నివాసం ఉంటున్న రాజేశ్వరి (35) అనే మహిళ మంగళవారం ఉరి వేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమెకు భర్త వెంకటేష్‌తో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ బాడుగ ఇంట్లో ఉంటున్నారు. శిడ్లఘట్టలోనే ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే అనంత్‌కుమార్‌– రాజేశ్వరి మధ్య 4 ఏళ్ల నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది.

చదవండి: ఇంటర్‌ యువతికి ప్రేమ వేధింపులు.. మనస్తాపానికి గురై

ఈ నెల 21వ తేదీన ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఇంతలోనే రాజేశ్వరి అనూహ్యంగా శవమైంది. తన భార్యను అనంత్‌ కుమారే హత్య చేశాడని భర్త పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. మరోవైపు అనంత్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. దోషుల్ని శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.
చదవండి: 1959లో హత్యాచారం.. డీఎన్‌ఏ టెస్ట్‌తో ఇప్పుడు తీర్పు.. ట్విస్ట్‌ ఏంటంటే

మరిన్ని వార్తలు