ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!

5 Aug, 2022 15:10 IST|Sakshi

బెంగళూరు: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. 

పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్‌ ఎక్కి కాసేపు నిలబడింది. గమనించిన కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్‌ఆర్‌ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన గురువారం జరిగినట్లు పేర్కొన్నారు.

నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్‌ కాగా.. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా. ‘తల్లి మానసిక పరిస్థితి సహా మేము అన్ని కోణాల్లో విచారిస్తున్నాము.’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి

మరిన్ని వార్తలు