భార్యను ఏడు గంటల పాటు చెట్టుకి కట్టి...చిత్రహింసలకు గురి చేసి..

31 Jul, 2022 10:50 IST|Sakshi

చిన్న అనుమానం తలెత్తిన భార్యలపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. వాస్తవం తెలుసుకునేందుకు యత్నించకుండా ఇరు జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మహిళల భద్రతకై ఎన్ని చట్టాలను ప్రభుత్వ యంత్రాంగం తీసుకువచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయలేక పోతున్నాం. ఇక్కడొక వ్యక్తి అలానే కట్టుకున్న భార్య పై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకెళ్తే....రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఓ మహిళను ఆమె భర్త, భర్త తరుపు ఇతర బంధువులు ఆమెను చెట్టుకి కట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ మహిళ దెబ్బలకి తాళలేక కేకలుపెడతూనే ఉంది.  అసలేం జరిగిందంటే ఆమెను తన స్నేహితుడితో ఉండటం చూసిన సదరు వ్యక్తి ఆగ్రహవేశాలకు లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో కనిపించిన వ్యక్తిని కూడా చెట్టుకు కట్టి ఇలానే హింసించారు.

ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో బీజేపీ నేతలు రాజస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల  ఎక్కుపెట్టారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యూ) రాజస్తాన్‌ డీజీపీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయడమే కాకుండా బాధితురాలికి తగిన వైద్యం అందించి, భద్రత కల్పించాలని అధికారులను కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి భర్త, బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

(చదవండి: పార్ట్‌ టైం పని అని రూ.3 లక్షలు టోపీ )

మరిన్ని వార్తలు