నిద్రపోతున్న భర్తపై పెట్రోల్‌ పోసి..

16 May, 2021 17:06 IST|Sakshi

టీ.నగర్‌ : చెన్నై సమీపంలోని పల్లికరనైలో భర్తను సజీవ దహనం చేసేందుకు యత్నించిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. పెరియార్‌నగర్‌కు చెందిన పాండి (42) ఇస్త్రీ కార్మికుడు. ఇతనికి భార్య పార్వతి (34), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఏడాదిగా ఆదాయం లేదు. దీనికితోడు పాండికి మద్యం సేవించే అలవాటు ఉండడంతో దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. పాండి భార్యపై దాడి చేశాడు. అనంతరం మద్యం సేవించి నిద్రించాడు.

కొద్ది సేపటికే పాండి శరీరంపై మంటలతో కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి మంటలను ఆర్పి కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాండి వద్ద చెన్నై ఎగ్మూర్‌ ఎక్స్‌ప్రెస్‌ కోర్టు న్యాయమూర్తి మరణ వాంగ్మూలం తీసుకున్నారు. తన భార్య ఒంటిపై పెట్రోలు కుమ్మరించి నిప్పంటించిందని, తాను తప్పించుకోకుండా ఇంటికి తాళం వేసిందని పేర్కొన్నాడు. మడిపాక్కం పోలీసుల విచారణలోనూ పార్వతి భర్తపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్టు అంగీకరించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు