Tamil Nadu: పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి.. బంగారం చోరీ కేసులో అరెస్ట్‌

22 Feb, 2022 13:37 IST|Sakshi

సాక్షి, చెన్నై: పోలీసు ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి 12 సవర్ల చోరీ కేసులో అరెస్టయ్యింది. వివరాలు.. విల్లుపురం జిల్లా, సెంజి అలంపూండికి చెందిన మాధవి (42).  పుదుచ్చేరి కనక శెట్టి కులంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పని చేస్తున్నారు. పుదువై కుళవర్‌ పాలయం పట్టిలోని ఓ ప్రైవేటు లేడీస్‌ హాస్టల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ బంధువు వివాహ కార్యక్రమానికి 12 సవర్ల నగలు ధరించి వెళ్లారు. తర్వాత హాస్టల్‌ను వచ్చిన మాధవి నగలను తీసి గదిలో పెట్టారు. ఉదయం లేచి చూసిన సమయంలో నగలు అదృశ్యమ య్యాయి. దీంతో ఉరులియన్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఆ సమయంలో పక్క గదిలో నివాసం ఉంటున్న ఓ యువతిని ప్రశ్నించారు. విచారణలో తనే నగలు చోరీ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కాగా నిందితురాలు రాష్ట్ర పోలీస్‌ పరీక్షలో ప్రతిభ చూపి ఉద్యోగానికి ఇటీవల ఎంపికైంది. మార్చి 1 నుంచి వీధుల్లో చేరాల్సి ఉంది. ఆమె ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చి మహిళా హాస్టల్లో ఉంటోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అరెస్టవడం చర్చనీయాంశమైంది.
చదవండి: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం .. 14 మంది మృతి.. మోదీ సంతాపం
చదవండి: ప్రేమ పేరుతో వంచన.. పిల్లలు పుడితే ఒప్పుకుంటారని చెప్పి

మరిన్ని వార్తలు