తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తికి కూతురి ఘోరమైన శిక్ష

3 May, 2022 08:48 IST|Sakshi

గుంటూరు: వివాహేతర సంబంధం  నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వ్యక్తి మర్మాంగాన్ని కోసిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. టూ టౌన్‌ సీఐ బి. కోటేశ్వరరావు కథనం ప్రకారం.. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన  రామచంద్రారెడ్డి తెనాలిలో మడత మంచాలు అద్దెకు ఇచ్చే లాడ్జీలో ఉంటూ కూలి పనులకు వెళుతుంటాడు. ఇతనికి  ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరూ మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లగా, ఇద్దరూ కలసి పూటుగా మద్యం సేవించారు. మేడపైన రామచంద్రారెడ్డి పడుకోగా,   ఆమె కింద ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో ఆమె కూతురు, మరో వ్యక్తి ఇంటికి వచ్చారు. మేడ పైకి వెళ్లి నిద్రిస్తున్న రామచంద్రారెడ్డి మర్మాంగాన్ని (బీర్జాలను) బ్లేడుతో కోశారు. అతన్ని స్థానికులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ వైద్యశాలకు వెళ్లి  వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు