తాగిన మైకంలో పోలీస్‌ హల్‌ చల్‌.. మహిళతో అసభ్యకర ప్రవర్తన.. చెప్పుతో కొట్టిన వీరనారి

19 Mar, 2022 19:14 IST|Sakshi

లక్నో: అతనో పోలీస్‌.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిందిపోయి.. తాగిన మైకంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను బలంగా తోసేశాడు.. చివరకు ఆమె వీరనారిలా పోరాడింది. అందరూ చూస్తుండగానే పోలీసును తన చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మద్యం సేవించి హల్‌ చల్‌ చేశాడు. చార్‌ బాగ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటనకు దిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు, మహిళపై తన ప్రతాపం చూపించాడు. లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో మహిళను తోసివేయగా ఆమె కిందపడిపోయింది. అనంతరం పైకి లేచిన సదరు మహిళ.. పోలీసులపై చెప్పుతో దాడికి దిగింది. 

ఈ సందర్భంలో వారి పక్కనే ఉన్న మరో మహిళా పోలీస్‌.. అతడిని వారిస్తున్న అదేమీ పట్టించుకోకుండా వారిపై కానిస్టేబుల్‌ దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఇతర పోలీసులు వచ్చి అతడిని అడ్డుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స‍్పందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు