పోలీసుల నిర్వాకం.. తప్పుడు కేసులు పెడతామని మహిళపై లైంగిక దాడి

14 May, 2022 13:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

క్రిష్ణగిరి(బెంగళూరు): లైంగిక దాడికి పాల్పడినట్లు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సూళగిరి సమీపంలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల మహిళ హోటల్‌ నిర్వహిస్తుంది. సూళగిరి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులు తరచూ హోటల్‌కు వెళ్లి భోజనం తీసుకెళ్లేవారు. కర్ణాటక మద్యం, గంజాయి విక్రయిస్తున్నట్లు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ ఈనెల 4వ తేదీన తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు హోసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసిం

మరో ఘటనలో.. 

కిలేడీల చేతివాటం   
హోసూరు: హొసూరు–బాగలూరు రోడ్డులో దోపిడీకి పాల్పడిన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని బాపునగర్‌కు చెందిన జ్యోతి(30), సబీన(25), జ్యోతి(32) అనే దొంగలను హడ్కో పోలీసులు అరెస్ట్‌ చేశారు.  హొసూరులోని అణ్ణా నగర్‌కు చెందిన ఉమామహేశ్వరి అనే మహిళ హొసూరు–బాగలూరు రోడ్డులో బస్టాప్‌ వద్ద బస్సు కోసం వేచి ఉండగా నిందితులు ఆమెతో మాటలు కలిపి పర్సు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.   

మరిన్ని వార్తలు