క్షుద్రపూజలకు మహిళ బలి?

29 Aug, 2022 01:38 IST|Sakshi
అనూష 

భర్త, అత్త పనేనని కుటుంబసభ్యుల ఆరోపణ

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన 

భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరులో మూటపురం అనూష(30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్త క్షుద్రపూజల వల్లే ఆమె బలి అయిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన అనూష వివాహం జూలూరుకు చెందిన మూటపురం బాబురావుతో 2017లో జరిగింది.

వీరికి ఇద్దరు కుమార్తెలు, 6 నెలల కుమారుడు ఉన్నాడు. విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఆపరేటర్‌ అయిన బాబురావు చేయి ఇటీవల విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. కుటుంబ కలహాలతో నిత్యం బాబురావు భార్యను కొట్టి వేధించేవాడు. ఈ క్రమంలో అనూష వారంరోజులుగా అమ్మతల్లి సోకి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం బాబురావు తన బావమరిది గిరిబాబుకు ఫోన్‌ చేసి అనూష ఆరో గ్యం విషమంగా ఉందని, వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన వచ్చే సరికి ఓ గదిలో అనూష శరీరమంతా కాలిపోయి మృతి చెంది ఉంది. 

 క్షుద్ర పూజలనే అనుమానం.. 
అనూష అత్త యాదమ్మ తరచూ క్షుద్రపూజలు చేస్తుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శనివారం అమావాస్య కావడం, అనూష మృతదేహం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉండటం, ఉదయం వరకు ఇంట్లో పెద్ద దీపం వెలుగుతుండటం వంటివి విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది.

అనూషకు మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత క్షుద్రపూజలు చేసి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూ ష ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు భర్త, అత్త ఆమె ఒంటిపై యాసిడ్‌ పోసినట్లు సమాచారం. 

ఇంట్లోని వస్తువులు ధ్వంసం : అనూషను భర్త, అత్త కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు బాబురావు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. న్యా యం చేసేవరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించి కూర్చున్నారు. చివరకు ఇరు కుటుంబాల పెద్ద మనుషులు  రూ. 7.50 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం చేసుకు న్నట్లు సమాచారం. బాబురావు, యాదమ్మ పోలీసుల అదు పులో ఉన్నట్లు సమాచారం. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు