దారుణం: మహిళను జుట్టుపట్టుకొని లాగి.. అడ్డొచ్చిన వ్యక్తిని!

16 Apr, 2021 17:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్లబెల్లి( జయశంకర్‌ భూపాలపల్లి) : దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగరాజుపల్లి శివారు పంతులుపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ జుట్టుపట్టి లాగి కొడుతూ అవమానించాడు.

ఈ సంఘటనను చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన చుక్క సాంబయ్యపై కర్రతో దాడి చేశాడు. దీంతో సాంబయ్య తలకు తీవ్రగాయమైంది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు