తియ్యటి మాటలు.. అందమైన ప్రొఫైల్‌ ఫోటోతో రూ.1.20 కోట్లు కొట్టేసింది

7 Oct, 2021 07:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నకిలీ ప్రొఫైల్‌తో ట్రాప్‌చేసిన మహిళ

తొమ్మిది నెలల్లో రూ.1.20 కోట్లు కాజేసిన వైనం

కొట్టేసిన డబ్బుతో ప్రియుడితో జల్సాలు

అంబర్‌పేట పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: తియ్యగా మాట్లాడుతూ...అందమైన యువతి ఫొటోతో తప్పుడు ఫ్రొఫైల్‌ సృష్టించిన యువతి ఓ వ్యక్తికి వలవేసింది. అతడి నుంచి దాదాపు రూ.1.20 కోట్లు కాజేసింది. గత డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు విడతల వారీగా వివిధ కారణాలు చెప్పి డబ్బులు లాగింది. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మల్లేశ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటురు జిల్లాకు చెందిన వి.సుబ్బారెడ్డికి బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాయిరాంతో పాత పరిచయం ఉంది. గత డిసెంబర్‌ నెలలో వారిరువురు అనుకోకుండా చాలకాలం తర్వాత కలుసుకున్నారు.
చదవండి: పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..

ఈ సందర్భంగా సాయిరాం తమ మరదలు అర్చన(24) బ్యూటీ పార్లర్‌ నడుపుతుందని పెట్టుబడి కోసం ఏదైనా సహాయం చేయాలని కోరుతూ సుబ్బారెడ్డికి ఆమె ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సుబ్బారెడ్డి, అర్చనలు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే అర్చన తన ఫొటోకు బదులు అందమైన యువతి ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా ఉంచి తనదేనంటూ సుబ్బారెడ్డిని నమ్మించింది. తరచు సుబ్బారెడ్డికి ఫోన్‌ చేసి బ్యూటీపార్లర్, ఇతర అవసరాల పేరుతో విడతలవారీగా అన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకుంది. సుబ్బారెడ్డి ఆమెను ప్రత్యక్షంగా కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏవో సాకులు చెబుతూ ఈ ఏడాది ఆగస్టు నెల వరకు తప్పించుకు తిరిగింది.
చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి

పలుమార్లు గుంటూరు నుంచి నగరానికి వచ్చిన సుబ్బారెడ్డి ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో సీసీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుడు సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అర్చన, అమె బావ సాయిరాం,  ప్రియుడు అనిల్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు