కుటుంబంలో గొడవలు.. విచక్షణ కోల్పోయిన ఆమహిళ..

23 Apr, 2021 17:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సుభాష్‌నగర్‌(కుత్బుల్లాపుర్‌): కుటుంబంలో చిన్నపాటి గొడవలతో కొంత మంది విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటన గురువారం దూలపల్లిలో చోటు  చేసుకుంది. దూలపల్లి కమ్మరిబస్తీ గుడిసెల్లో ఉండే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.

దీంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు పక్కనే ఉన్న లింగయ్య చెరువులో దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడికి ఒడ్డుకు తీసుకు వచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  

మరిన్ని వార్తలు