ఆరునెలల్లో కూతురు వివాహం.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా.

31 Aug, 2021 16:45 IST|Sakshi
గొడుగు సింధూజ (ఫైల్‌)

సాక్షి, దేవరుప్పుల(వరంగల్‌): ఆరు నెలల్లో కూతురు వివాహం చేయాలనే తలంపుతో దైవదర్శనికి వెళ్లొస్తున్న కుటుంబాన్ని వరద రూపంలో మృత్యువు వెంటాడింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి చిన్నమడూరుకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గొడుగు సుజాత మల్లికార్జున్‌ దంపతులకు కొడుకు నవీన్, కూతురు సింధూజ ఉన్నారు. మల్లికార్జున్‌ కులవృత్తి చేపల పెంపకంతోపాటు రాజకీయంగా ప్రాబల్యం కలిగి ఉన్నాడు.

ఇటీవల కొడుక్కి సాప్టవేర్‌ ఉద్యోగం వచ్చింది. ఇక కూతురు వివాహం చేద్దామని సంబంధాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి అమ్మమ్మ ఊరైన యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రాజపేట మండలం బొందుగులలో తోడల్లుడు పొన్నం ఆంజనేయులు చేపల పెంపకం యూనిట్‌ ప్రారంభోత్సవానికి పిలువగా కారులో కుటుంబసభ్యులు వెళ్తున్నారు. మల్లికార్జున్‌ సమీపబంధువు శ్రవణ్‌.. సింధూజ, హిమబిందులను మోటరు సైకిల్‌పై తీసుకెళ్తుండగా పారుపెల్లివాగు ఉధృతి పెరగడంతో కురారం మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుడ్యామ్‌పై జారిపడి వరదల్లో కొట్టుకుపోయారు. ఈ సంఘటనలో సింధూజ మృతదేహం లభ్యంకాగా హిమబిందువు జాడదొరకలేదు.  

చదవండి: మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి.. ఐదుగురు కలిసి ఇంట్లో బంధించి..

మరిన్ని వార్తలు