జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి పైశాచికత్వం

2 Jul, 2021 21:06 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో 19 ఏళ్ల యువతిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కర్రలతో చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన సొంత తండ్రి, సోదరులే యువతిపై అమానుష దాడికి పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగుచూశాయి.

వివరాలు..  గిరిజన తెగకు చెందిన ఒక యువతి మూడు నెలల క్రితం  ఇంట్లోవాళ్లకు చెప్పకుండా తమ బంధువుల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి యువతి తండ్రి, సోదరులు ఆమెపై కోపంతో రగిలిపోతున్నారు. కాగా సదరు యువతి తన వాళ్లను చూసేందుకు జూన్‌ 28న తన సొంతూరుకు వచ్చింది. ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న తండ్రి ఊరి పొలిమేరలోనే అడ్డుకొని దాడికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా కన్నకూతురనే జాలి లేకుండా ఆమె జట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి ఒక చెట్టుకు కట్టేశాడు. అనంతరం యువతి సోదరులు ఆమెను కర్రలతో చితకబాదారు.

ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన ఫోన్‌లో బంధించాడు. ఆ వీడియోలో యువతిని చితకబాదుతుంటే నవ్వుతూ చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాలేదు.ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని ఆమె తండ్రితో పాటు సోదరులను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు