పక్కూరి జాతరకు.. అక్కడినుంచి చెన్నై

1 Mar, 2021 22:12 IST|Sakshi

భువనేశ్వర్‌ : బాలిక అపహరణ కేసులో కొశాగుమడ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నవరంగపూర్‌ జిల్లా కొశాగుమడ సమితి చురాహండి గ్రామానికి చెందిన బాలికతో అదే గ్రామానికి చెందిన మధుసూదన మాలి(23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. జనవరి 28న పక్క గ్రామంలో జరిగిన జాతరకు బాలికను తీసుకువెళ్లాడు. అక్కడ నుంచి చెన్నై తీసుకువెళ్లి రెండు నెలలుగా అక్కడే ఉన్నారు. బాలిక అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు గతంలో కొశాగుమడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే వారిద్దరూ చెన్నై నుంచి వచ్చారని సమాచారం అందడంతో పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి అపహరించిన కేసులో యువకుడిని అదుపులోకి తీసుకుని శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసు అధికారి నటబర నందో తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు