చూసి నవ్వడమే ఆ టీచర్‌కు శాపమైంది.. ప్రేమ, పెళ్లి పేరుతో సహజీవనం, ఆపై

28 Jul, 2021 15:42 IST|Sakshi

తిరువనంతపురం: ఓ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలిని చూశాడు.. అతడిని ఆమె చూసింది. అయితే అతడిని చూసి నవ్వడమే ఆమెకు శాపంగా మారింది. అప్పటినుంచి ఆ యువకుడు ఆమె వెంట పడుతూ తనను పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. తనకు పెళ్లయ్యిందని చెప్పినా వినకుండా వెంటపడ్డాడు. ప్రేమ.. పెళ్లి వద్దు స్నేహంగా ఉందామని ఆమె చెప్పగా.. మీతో ఒక్కసారి లైంగికంగా కలవాలని పట్టుపడ్డాడు. అతడిని గుడ్డిగా నమ్మి సహజీవనం కూడా చేసింది. తీరా చూస్తే అతడు వేరే యువతులతోనూ సంబంధాలు కొనసాగిస్తుండడంతో ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

కోజికోడ్‌ జిల్లా ఇరవన్నూర్‌కు చెందిన రంజిత్‌ ఒకసారి పాతనంతిట్టకు చెందిన ఉపాధ్యాయురాలిని ఓ కార్యక్రమంలో చూశాడు. అతడిని పొరపాటున చూసిన ఆమె నవ్వడంతో అప్పటి నుంచి టీచర్‌ వెంట పడి వేధించసాగాడు. ఆమెతో లైంగిక జీవితం పొందాలని ఒత్తిడి చేశాడు. అయినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయ్‌.. నేను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేశాడు. అయితే అప్పటికే ఆమె భర్తకు దూరంగా నివసిస్తోంది. నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని వెంటపడుతుండడంతో ఆమె కరిగిపోయింది. దీంతో అతడితో కలిసి సహజీవనం చేయసాగింది. అతడితో కలిసి ఉంటున్న సమయంలోనే వేరేవారితో సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

ఇది తెలిసి ఆమె రంజిత్‌కు దూరంగా ఉంటోంది. అయితే తనను వదిలేసి వెళ్లినా పర్లేదు కానీ ‘మీతో ఒక్కసారి కావాలి టీచర్‌ ప్లీజ్‌’ ఆమెతో శారీరక సంబంధం కోరాడు. అతడి వేధింపులు తీవ్రమయ్యాయి. ఆమెకు సంబంధించిన రహాస్య ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతూ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.   వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు