బాలికతో ప్రేమ.. సోషల్‌ మీడియాలో పరిచయమై.. మాయమాటలు చెప్పి..

26 Nov, 2021 06:51 IST|Sakshi

తిరువళ్లూరు(తమిళనాడు): మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ వ్యవహారం నడిపిన ఓ యువకున్ని తిరువళ్లూరు పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 18వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరువణ్ణామలై జిల్లా దూశీ సమీపంలోని హనుమంత పేటలో బాలిక ఓ యువకుడితో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: సింగర్‌ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’

అనంతరం ఆ యువకుడిని విచారించగా తిరువణ్ణామలైకు చెందిన గోపీ(21) అని తేలింది. ఆ యువకుడితో బాలికకు సోషల్‌ మీడియా ద్వారా అయిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడు బాలికను తిరువణ్ణామలైకు తీసుకెళ్లినట్లు తెలిసింది. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
చదవండి: ‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్నా’

మరిన్ని వార్తలు