పెళ్లైన రెండో రోజే.. మాజీ ప్రియురాలి చేతిలో ప్రియుడి హత్య.. ఎందుకంటే?

12 Jun, 2021 20:54 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 26 ఏళ్ల యువకుడిని తన మాజీ ప్రియురాలు హత్య చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సిహోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్జీ గ్రామంలో నివసిస్తున్న సోను పటేల్‌​కు మే 14న వివాహం జరిగింది. అయితే  పెళ్లైన రెండు రోజుల తరువాత సెల్‌ఫోన్ బాగుచేయించడానికి వెళ్లిన అతడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుంటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.’’ అని పోలీసులు తెలిపారు. కాగా విచారణ చేపట్టిన పోలీసులు మధు అనే అమ్మాయితో అతడికి ఎఫైర్‌ ఉన్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు.

మే 16న సోనుని రాళ్లతో కొట్టి చంపినట్లు ఆమె ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. సోను తనకు సంబంధించిన  అభ్యంతరకరమైన వీడియోను చిత్రీకరించాడని, దానిని తన కుటుంబ సభ్యులకు చూపించడంతో ఆమె పెళ్లి చెడిపోయినట్టు పేర్కొన్నారు. ఇక సోనును వివాహం చేసుకోవాలి అనుకున్నట్టు మధు తెలిపిందని అన్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యింది వెల్లడించారు.

చదవండి: వైరల్‌: ఫుట్‌బాల్‌ ఆట మధ్యలో పారాచూట్‌తో దూకేసిన వ్యక్తి.. ఆపై 

చదవండి: కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు