వివాహేతర సంబంధం.. ప్రియుడికి ఊహించని షాక్‌ ఇచ్చిన ప్రియురాలు

27 Jan, 2023 08:56 IST|Sakshi
వాన రమణ (ఫైల్‌)

రామవరప్పాడు(గన్నవరం): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో జరిగింది. రామవరప్పాడు కాలువగట్టు ప్రాంతం తోటల్లో వాన రమణ (30) తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణ తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇదే ప్రాంతం పక్క వీధిలో మీసాల లక్ష్మి తన భర్త, ఇద్దరు కుమారులతో నివసిస్తోంది.

రమణ, లక్ష్మి మధ్య ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. పిల్లలు పెద్దవారవుతున్నందున వివాహేతర సంబంధం కుదరదని రమణను లక్ష్మి దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో వారి మధ్య పలుమార్లు గొడ వలు జరిగాయి. రమణపై పటమట పోలీస్‌ స్టేషన్‌లో లక్ష్మి రెండు సార్లు ఫిర్యాదు కూడా చేసింది. అయితే లక్ష్మి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని భావించిన రమణ బుధవారం మధ్యాహ్నం లక్ష్మి ఇంటికెళ్లి తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ ఘర్షణకు దిగాడు.

సహనం కోల్పోయిన లక్ష్మి కూరగాయలు కోసే కత్తితో రమణ పొట్టలో పొడిచింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున రమణ మృతి చెందాడు. లక్ష్మిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఆదిలాబాద్‌: కుప్పకూలిన పెళ్లి కొడుకు.. కన్నుమూత!  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు