నాగరాజుతో వివాహేతర సంబంధం.. తల్లీకొడుకు మధ్య గొడవలో..

12 May, 2022 07:45 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, సత్యసాయి జిల్లా(గోరంట్ల): మండల పరిధిలోని వానవోలు గ్రామానికి చెందిన చాకలి ఈశ్వరమ్మ (42) అనే వితంతువును కుమారుడు పవన్‌ హత్య చేశాడు. వివాహేతర సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో  మంగళవారం రాత్రి కట్టెతో కొట్టి, బండరాయితో మోది హతమార్చాడు. గోరంట్ల సీఐ జయనాయక్‌ తెలిపిన మేరకు.. ఈశ్వరమ్మ భర్త చాకలి కుళ్లాయ్యప్ప పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

చదవండి: (వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు అరెస్ట్‌)

కుమారుడు పవన్‌కు కొంత కాలం క్రితం వివాహమైంది. అతని భార్య ఇటీవల పుట్టినింటికి వెళ్లింది. వివాహేతర సంబంధం మానుకోవాలని తల్లికి పవన్‌ అనేక సార్లు సూచించాడు. ఆమె పెడచెవిన పెడుతూ వచ్చింది. ఈ విషయంపై మంగళవారం రాత్రి తల్లీకొడుకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పవన్‌పై తల్లి ఇటుకతో దాడి చేయడానికి ప్రయత్నించగా.. అతను ఆగ్రహానికి గురై కట్టెతో కొట్టి, బండరాయితో మోది చంపేశాడు.

తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి ఇంటికి సమీపంలోని మొక్కజొన్న చేనులో పడేశాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐ జయనాయక్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తల్లిని తానే చంపినట్లు పవన్‌ అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.   

చదవండి: (Hyderabad: అతడే ఆమెగా మారి!) 

మరిన్ని వార్తలు