పెళ్లి చేసుకుంటావా.. లేదా అంటూ యువతిని నడిరోడ్డుపై

4 May, 2021 06:54 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: నన్ను పెళ్లి చేసుకుంటావా... లేదా అంటూ ఓ యువతి చెంప చెల్లుమనిపించాడో యువకుడు. ఫోన్‌ చేసి పదేపదే విసిగిస్తుండడంతో ఆ యువతి నారాయణగూడ పోలీసులును ఆశ్రయించింది. వివరాలోకి వెళితే.. కవాడిగూడకు చెందిన యువతి  నారాయణగూడలోని ఓ కూరగాయల షాప్‌లో పనిచేస్తోంది. బన్సీలాల్‌పేటకు చెందిన వేణు ఆ యువతి కొంతకాలంగా చనువుగా ఉన్నారు. ఇద్దరి నడుమా కొద్దిరోజుల క్రితం వాగ్వాదం జరిగింది.

అప్పటి నుంచి ఆ యువతి వేణును దూరం పెట్టింది. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. ఈ క్రమంలోనే ఆ యువతి తాను పనిచేస్తున్న షాప్‌ నుంచి వేరేచోటకు వెళ్లింది. వారం రోజుల క్రితం నారాయణగూడ వైఏంసీ సమీపంలోని ఒక కూరగాయల స్టోర్‌లో చేరింది. విషయం తెలుసుకున్న వేణు సోమవారం ఆమెకు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో షాప్‌ వద్దకు వచ్చి బయటకు రమ్మని పిలిచాడు.

వచ్చీరాగానే ఆ యువతిపై చేయి చేసుకున్నాడు. ‘ఫోన్‌ చేస్తే ఎందుకు ఎత్తడం లేదు...పెళ్లి అంటే ఏం మాట్లాడవని’ ఊగిపోతూ జుట్టు పట్టుకుని చితకబాదాడు.ఈ క్రమంలో ఆ యువతి చెల్లి, తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. పదిహేను నిమిషాల వ్యవధిలోనే యువతి చెల్లి సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికీ ఆమెను కొడుతూనే ఉన్నాడు.

‘మా అమ్మానాన్న వస్తున్నారు... ఇక్కడే ఉండు నీ సంగతి చూస్తారంటూ’ యువతి చెల్లి బెదిరించగా, క్షణాల వ్యవధిలో వేణు పరారయ్యాడు. ఆ యువతిని తీసుకుని తల్లిదండ్రులు ఇంటికి చేరారు. వేణు మళ్లీ ఫోన్‌ చేసి ఆ యువతిని బండబూతులు తిట్టాడు. దీంతో కుటుంబసభ్యులతో వచ్చి నారాయణగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లై ఏడాది కాకముందే.. వేధింపులతో వివాహిత బలవన్మరణం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు