నా చావుకు ఎవరూ కారణం కాదు..!

8 Nov, 2021 11:37 IST|Sakshi

సాక్షి, చందంపేట(నల్లగొండ): ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని గువ్వలగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గువ్వలగుట్ట గ్రామానికి చెందిన సపావత్‌ భూర్య, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాల్గో కుమారుడు సపావత్‌ నరేశ్‌(32) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ పూర్తిచేశాడు. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన నరేశ్‌ ఇంటి వద్దే ఉంటున్నాడు.

ఏమైందో తెలియదు గాని శనివారం తెల్లవారుజామున నరేశ్‌ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో నరేశ్‌కు ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ రాసిన సూసైడ్‌ నోట్‌ లభించిందని మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులను సంప్రదించగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 

చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు..

మరిన్ని వార్తలు