యువతి బయటకు రాలేదని.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

22 Jun, 2021 10:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రియురాలు తన ప్రేమను అంగీకరించకపోవటంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహిదుద్దీన్‌ వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్తా అపార్టుమెంట్‌లో కె.శుభమ్‌ (27), తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటూ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత మూడేళ్లుగా బాలానగర్‌ శోభనా కాలనీలో రోడ్డు నెంబర్‌ –1 లో నివాసముండే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.

ఈ నెల 20వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో తన ప్రేమ విషయం తెలిపేందుకు యువతి నివాసానికి వెళ్లాడు. నాలుగో అంతస్తులో ఉంటున్న ఆమెను కలిసి తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కోరగా ఆమె ఒప్పుకోకపోవడంతో శుభమ్‌ అక్కడి నుంచి దూకి మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: శ్రీకాంత్‌ ఫ్రమ్‌ సీఎం పేషీ.. బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టు కావాలా? 

మరిన్ని వార్తలు