అయ్యో పాపం ఏ కష్టం వచ్చిందో.. రైలుకు ఎదురెళ్లి..

21 Nov, 2021 21:20 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: రామగుండం రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా సంజయ్‌ సికింద్రాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్‌ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది. సంజయ్‌ మానసిక పరిస్థితి సరిగా లేనట్టు బంధువులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు