స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమ.. ఆమె మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి..

22 Feb, 2022 07:53 IST|Sakshi
అమిత్‌కుమార్‌ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌ (వరంగల్‌): ప్రియురాలు ఫోన్‌ లేపట్లేదని ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. డివిజన్‌ కేంద్రంలోని రైస్‌మిల్లులో ఆపరేటర్‌గా పనిచేసే కార్మికుడు అమిత్‌కుమార్‌(20) మనస్తాపంతో సోమవారం ఉరేసుకున్నాడు. అమిత్‌కుమార్‌ స్వగ్రామం బీహార్‌ రాష్ట్రం మధువనిలోని బాలువాటోల్‌ గ్రామం. నాలుగు నెలలుగా ఘన్‌పూర్‌లోని రైస్‌మిల్లులో పని చేస్తున్నాడు.

స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. రోజూ ఆమెతో ఫోన్‌ మాట్లాడేవాడు. కొద్ది రోజులుగా ఆమె ఫోన్‌ చేయడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. స్నేహితులను వాకబు చేయగా.. ఆమె మరొకరిని ప్రేమిస్తోందని వారు సమాధానమిచ్చారు. దాంతో అమిత్‌కుమార్‌ మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు పలుమార్లు ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో మిల్లులోనే ఉరేసుకున్నాడు.

ఉదయం తోటి కార్మికులు గమనించి మిల్లు యజమానికి సమాచారం అందించారు. యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేశారు. పోస్ట్‌మార్టం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. సహ కార్మికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

చదవండి: (అమ్మా.. తెల్లారింది లేమ్మా!) 

మరిన్ని వార్తలు