Karimnagar: రూ.3 వేల కోసం ప్రాణం తీసుకున్నాడు

6 Jan, 2023 15:44 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: తండ్రి రూ.3 వేలు ఇవ్వలేదని, క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన అప్పాల మల్లేశ్‌–జల దంపతులకు కుమార్తె, కుమారుడు వికాస్‌(19) ఉన్నారు. కూతురికి వివాహం కాగా కుమారుడు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మిడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం తల్లి జల వ్యవసాయ పనులకు వెళ్లింది. తండ్రి గొర్రెలను మేపేందుకు వెళ్తుండగా వికాస్‌ తనకు రూ.3 వేల కావాలని అడిగాడు.

ఇప్పుడు తన వద్ద లేవని, సాయంత్రం వచ్చాక ఇస్తానని చెప్పి, మల్లేశ్‌ గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన వికాస్‌ క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి, ఉరేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు