రూ.లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు ఇస్తాం 

24 Oct, 2021 03:58 IST|Sakshi
నవీన్‌ (ఫైల్‌)  

వ్యాపారం పేరుతో యువతి ఎర

మోసపోయి యువకుడి ఆత్మహత్య 

నల్లగొండ క్రైం: ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తుతెలియని యువతితో చాటింగ్‌ చేసిన ఓ యువకుడు మోసపోవడం తో ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడెంకు చెందిన గోగికార్‌ నవీన్‌ అలియాస్‌ చింటు (23)కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. తాను నడిపే బిజినెస్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు వస్తాయని యువకుడిని నమ్మించింది. దీంతో నవీన్‌ ఆమె ఆన్‌లైన్‌ ఖాతాలో రూ. లక్ష చెల్లించాడు.

ఆ తర్వాత ఆ యువతిని రూ.3 లక్షల కోసం అడగగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేసింది. దీంతో నెల రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించడంతో కాపాడగలిగారు. అదే బాధలో ఉన్న నవీన్‌ శనివారం పట్టణం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు