సినిమా థియేటర్‌లో ఉరి వేసుకున్నాడు

4 Mar, 2021 08:14 IST|Sakshi
మృతుడు శ్రీను(ఫైల్‌ ఫొటో)

షాద్‌నగర్‌రూరల్‌: కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు పనిచేసే సినిమా థియేటర్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్‌ పట్టణంలోని తిరుమల కాలనీకి చెందిన శ్రీను (22) పరమేశ్వర థియేటర్‌ క్యాంటీన్‌లో గత కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులతో జరిగిన గొడవల నేపథ్యంలో మనస్థాపం చెందిన శ్రీను బుధవారం తాను పనిచేస్తున్న పరమేశ్వర థియేటర్‌లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

ఒంటరి జీవితంపై విరక్తి చెంది మరొకరు.. 
చేవెళ్ల: ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శంకర్‌పల్లి పోలీస్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన  వివరాలు... ఒంగోలు జిల్లా టంగులూరు గ్రామానికి చెందిన మేదర్‌గాం«దీ(48) నాలుగు సంవత్సరాల కిత్రం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూరం గ్రామానికి కుటుంబంతో సహా వచ్చి బతుకుదెరువు నిమిత్తం వచ్చి కుటుంబంతో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సంవత్సరం కిత్రం మేదర్‌గాంధీ భార్య అతనితో విడిపోయి విడాకులు తీసుకుంది. 

అప్పటినుంచి అతడు మానసికంగా కుంగిపోయాడు. ఒంటరిగా ఉంటూ తీవ్ర మనస్థాపానికి గురైన మేదర్‌గాంధీ  శంకర్‌పల్లిలోని వైష్ణవి హోండా షోరూంలో ఖాళీగా ఉండే మూడవ అంతస్తులో ఉరివేసుకున్నాడు. రెండు రోజుల అనంతరం అందులో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది.  మృతుడి వద్ద లభించిన ఐడీ కార్డుల ఆధారంగా అతని వివారలను పోలీసులు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.    

చదవండి: ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు