పిల్లి అరుస్తూ  నిద్రాభంగం చేస్తోందని  యజమాని హత్య

28 Aug, 2022 09:09 IST|Sakshi

బంజారాహిల్స్‌: పెంపుడు పిల్లి అరుస్తూ నిద్రా­భంగం చేస్తోందని ఆగ్రహించిన ఓ యువకుడు దాని యజమానిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని మిథిలానగర్‌లో డాక్టర్‌ మీనన్‌ ఇంట్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నల్లాపూర్‌కు చెందిన ఓ బాలుడు(17)తోపాటు హరీశ్వర్‌రెడ్డి అలియాస్‌ చింటూ(20) అద్దెకు ఉంటున్నారు.

అసోంకు చెందిన ఎజాజ్‌ హుస్సేన్‌ (20), బ్రాన్‌ స్టిల్లింగ్‌(20) కూడా ఇదే ఇంట్లోని ఓ గదిలో అద్దెకుంటూ సెక్యూరిటీగార్డులుగా పని­చేస్తున్నారు. ఈ నెల 20న రాత్రి ఎజాజ్, బ్రాన్‌ ఇద్దరూ విధులు ముగించుకొని గదికి వెళ్తుండగా దారిలో కనిపించిన ఓ పిల్లిని వెంట తీసు­కెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లి అరుస్తుండ­టంతో పక్కనే ఉన్న హరీశ్వర్‌రెడ్డితోపాటు సదరు బాలు­డు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత కూడా పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తుండటంతో మద్యం మత్తులో ఉన్న బాలుడు కోపంగా ఎజాజ్‌ గదికి వెళ్లాడు. అక్కడే ఉన్న బాటి­ల్‌లోని పెట్రోల్‌ను ఆయనపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఎజాజ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొం­దుతూ గురువారంరాత్రి మృతి చెందాడు.

అయి­తే ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చని­పోయాడంటూ మొదట ఆ బాలుడితోపాటు హరీ­శ్వర్‌రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి స్నేహితుడు బ్రాన్‌ ఇచ్చిన ఫిర్యా­దుతో కేసును తిరగదోడిన పోలీసులు బాలుడి­తోపాటు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  

(చదవండి: దంపతుల ఆత్మహత్య)

మరిన్ని వార్తలు