అత్తారింట్లో గొడవ​: చనిపోతున్నానని సెల్ఫీ వీడియో

8 Jun, 2021 10:04 IST|Sakshi

సాక్షి,దోమకొండ(నిజామాబాద్​): బీబీపేట మండలం యడారం గ్రామానికి చెందిన వల్లెపు రమేష్‌(39)అనే యువకుడు ఆదివారంరాత్రి దోమకొండ మండలంలింగుపల్లిలో అత్తారింట్లో గొడవపడి వెళ్లిపోయడని ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. వివరాలు.. రమేష్‌ ఆదివారం రాత్రి అత్తారింట్లో బావమరిది శ్రీకాంత్​తో గొడవ పడి బైక్‌ తీసుకుని వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననిసెల్ఫీ వీడియో తీసి దానిని బావమరిది శ్రీకాంత్​కుపంపినట్లు ఎస్సై చెప్పారు. దీంతో రమేష్‌ మామ,బావమరిది వెంటనే పోలీస్‌స్టేషన్​  వచ్చి ఫిర్యాదు చేశారన్నారు.

సెల్​ఫోన్​   సిగ్నల్​ అధారంగా ఆదివారం రాత్రి నుంచి వెతకగా సోమవారంఉదయం దోమకొండ శివారులోని మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలో రమేష్‌ బైక్, దానికి కొద్ది దూరంలో షర్టు లభించాయన్నారు. కాగా తమ కొడుకును అత్తాగారింటి వారు చంపి ఉంటారని రమేష్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డాగ్‌స్వాడ్‌తో వెతికినా ఆచూకీ లభించలేదని ఎస్సైతెలిపారు. రమేష్​ తండ్రి మల్లయ్య ఫిర్యాదు  మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా రమేష్‌ మామతో పాటు బావమరిదిపై గతంలో పలువురిపై దాడులు, దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్సై చెప్పారు. 

చదవండి: వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు