ఆడుకుందామని వచ్చిన ఐదేళ్ల చిన్నారిపై..

14 Apr, 2022 08:57 IST|Sakshi
చంద్రమాంపల్లిలో యువకుడి ఇంటి వద్ద విచారణ చేస్తున్న దిశ డీఎస్పీ మురళీమోహన్‌

పెద్దాపురం(కాకినాడ జిల్లా): ఆడుకుందామని వచ్చిన చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో చోటు చేసుకుంది. దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ బి.అప్పారావు, సీఐ అబ్దుల్‌ నబీ, ఎస్‌ఐ రావూరి మురళీమోహన్‌లు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు ఇంటి వద్ద విచారణ చేపట్టారు.

చదవండి: చదువుకు దూరమై.. బతకడం భారమై..

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడు చెక్కిడాల రాజా తమ కుటుంబంలో ఉన్న బాలుడితో ఆడుకునేందుకు వచ్చిన ఐదేళ్ల బాలికను తన ఇంటిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పూర్తిగా విచారించగా ఇతడు ఓ వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలిసింది. ఘటనకు సంబంధించి చిన్నారి మాటలు, అక్కడ ఉదయం జరిగిన సంఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని దిశ డీఎస్పీ మురళీమోహన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు