నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి

15 May, 2022 13:42 IST|Sakshi

సాక్షి, పాలకోడేరు (తూర్పుగోదావరి): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ టీవీ సత్యనారాయణ పాలకోడేరులో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదివి ఇంటి దగ్గరే ఉంటోంది. వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన నల్లి దిలీప్‌ డెకరేషన్‌ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌ లో పరిచయం పెంచుకుని.. నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటికి తీసుకువెళ్లి అక్కడ కూడా లైంగిక దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై సీహెచ్‌ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.  

చదవండి: (పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ)

మరిన్ని వార్తలు