దారుణం: మూగ యువతిపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో..

14 Jun, 2021 10:38 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, ఖిలా వరంగల్‌ : మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శంభునిపేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మూగ యువతి తన తల్లి మరణంతో అమ్మమ్మ ఇంట్లో తండ్రితో పాటు ఆశ్రయం పొందుతోంది. ఆదివారం మధ్యాహ్నం తండ్రి పనికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడిన ముగ్గురు నిందితులు మూగ యువతిపై లైంగిక దాడికి పాల్పడుతూ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రికరించినట్లు సమాచారం. ఇంట్లో ఉన్న యువతి ఆమ్మమ్మకు కళ్లు కనిపించవు. చొరబడిన ముగ్గురిలో ఒకరు వృద్ధురాలి వద్ద కాపలా ఉండి మిగతా వారు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూసినట్లు తెలిసింది. నిందితులు ముగ్గురూ అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పథకం ప్రకారం ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

నిందితులు తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి రాగానే విలపిస్తున్న కూతురుని చూసిన తండ్రి ఏమి జరిగిందని అడగ్గా.. విషయం చెప్పడంతో మిల్స్‌కాలనీ పోలీస్‌ స్ట్రేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించినట్లు సమాచారం. ఈఘటన విషయమై ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌ను వివరణ కోరగా మూగ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు, ఒక యువకుడున్నాడని తెలిపారు. 

చదవండి: విషాదం: పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య  

    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు