Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!

17 Jun, 2022 07:09 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

మైనర్‌ బాలికపై యువకుడి లైంగిక దాడి  

జవహర్‌నగర్‌: మైనర్‌ బాలికకు మాయమాయటు చెప్పిన ఓ యువకుడు లైంగికదాడి చేశాడు. ఆ తరువాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది.

బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ఏప్రిల్‌ నెలలో  బాలిక ఇంట్లో నిద్రిస్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి పక్కన ఉన్న యువకుడు రవి (22) ఇంట్లోకి వెళ్లి బాలికపై  లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో, తల్లి కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది.

కొద్ది రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో స్ధానికంగా ఉన్న ఆర్‌ఎంపీని సంప్రదించారు. వైద్యపరీక్షలు నిర్వహించడంతో బాలిక గర్భవతి అయినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో 14 ఏళ్ల మైనర్‌ బాలికకు 20 సంవత్సరాలు ఉన్నట్లు వయస్సు అధికంగా వేయించి స్కానింగ్‌ చేయించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ రవి కుటుంబ సభ్యులు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించి గర్భం తీయించారు. కాగా  గురువారం బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

చదవండి: (భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం.. పిల్లలు అమ్మా అని...)

మరిన్ని వార్తలు