పెద్దపల్లి: మూడేళ్ల ప్రేమ.. పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి ఇంట్లో చొరబడి..

9 Nov, 2021 18:30 IST|Sakshi
విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. అత్యంత కిరాతకంగా గొంతు కోసి యువతిని హతమార్చాడు. రామగుండం కార్పొరేషన్‌ యైటింక్లైయిన్‌ కాలనీ కేకే నగర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజు, గొడుగు అంజలి అనే ఇద్దరు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

అంజలి డిగ్రీ చదువుతుండగా.. ప్రియుడు రాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అంజలి పెళ్లికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాజు.. ప్రియురాలి ఇంట్లోకి చొరబడి గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు వేగవంతం చేశారు.

చదవండి: (పోర్న్‌ వీడియోలు చూసి రాక్షసంగా.. ఓ చిన్నారి కేకలు వేయడంతో..)

మరిన్ని వార్తలు