ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి..

29 May, 2022 16:22 IST|Sakshi
షేక్‌ బాషా (ఫైల్‌)   

గుత్తి(అనంతపురం జిల్లా): స్నేహితుడి గదిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్‌ఎస్‌ పాత పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో నివాసముంటున్న షేక్‌ బాషా (23) శుక్రవారం రాత్రి సుందరయ్య కాలనీలోని స్నేహితుడు సురేష్‌ గదికి వెళ్లాడు. తెల్లారే సరికి అతను మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న సీఐ శ్యామారావు, ఎస్‌ఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్‌ ఆఫర్‌  

మరిన్ని వార్తలు