పెళ్లయిన 45 రోజులకే దారుణం..

10 Jan, 2021 12:09 IST|Sakshi
సాయినాథ్‌రెడ్డి (ఫైల్‌)

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

సాక్షి, నెల్లూరు (సంగం): బ్యాంక్‌కు వెళ్లొస్తానని భార్యతో చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన యువకుడు కర్ణాటకలోని బీజాపూర్‌ రైల్వేట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా సంగం మండలం దువ్వూరుకు చెందిన డాకా సాయినాథ్‌రెడ్డి (30)గా గుర్తించారు. అక్కడి పోలీసులు ఈ విషయమై కుటుంబసభ్యులకు శనివారం సమాచారమివ్వడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్‌.. మనోవేదనతో శిరీష)

వివరాలు.. సంగం మండలం దువ్వూరుకు చెందిన ద్వారకానాథ్‌రెడ్డి, కల్యాణి దంపతుల కుమారుడు సాయినాథ్‌రెడ్డి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసి, హైదరాబాద్‌లో షేర్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్‌ 25న వరంగల్‌కు చెందిన జ్యోత్స్నతో వివాహమైంది. వీరు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. అక్కడే చందానగర్‌లో ఉంటున్న మేనత్త గిరిజమ్మ ఇంటికి గురువారం వెళ్లి, జ్యోత్స్నతో మీరు కారులో దువ్వూరుకు వెళ్లండి.. కంపెనీలో ఉద్యోగులకు జీతాలిచ్చి 11వ తేదీన తానూ వస్తానని చెప్పారు.

అనంతరం ఇంటి నుంచి వెళ్లిన ఆయన బీజాపూర్‌ వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సాయినాథ్‌రెడ్డి జేబులోని సెల్‌ఫోన్లో లభ్యమైన నంబర్‌ ఆధారంగా రైల్వే పోలీసులు అతడి స్నేహితుడు అశోక్‌కు సమాచారం అందించి ఫొటోలను సైతం పంపారు. ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే ఇది ముమ్మాటికీ హత్యేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్‌ కూడా అక్కడే నిలిపి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. దీంతో బీజాపూర్‌ రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: (పాపం ఆమెకు తెలియదు.. భర్త శవమై వస్తున్నాడని..!!)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు