మహిళతో వీడియోకాల్‌.. పరువుపోతుందనే భయంతో..

12 Aug, 2021 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌లో ఓ మహిళతో వీడియో కాల్‌ మాట్లాడటమే శాపంగా మారిందో యువకుడికి. సదరు మహిళ స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి బెదిరింపులకు దిగటంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  లక్ష్మీ నగర్ బస్తీకి చెందిన శివ శంకర్ నాయక్ (24)అనే యువకుడికి కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. సదరు మహిళతో ఓ రోజు వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు.

వీడియో కాల్‌ స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసిన ఆమె బెదిరింపులకు దిగింది. డబ్బులు డిమాండ్‌ చేయ సాగింది. దీంతో భయపడిపోయిన శివ శంకర్‌ నాయక్‌.. పరువు పోతుందని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు