సమాజం తప్పుగా భావించింది.. మాది అన్నా చెల్లి బంధం

11 Aug, 2022 13:43 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: వారిద్దరివీ పక్క పక్క గ్రామాలు. చదువు కోసం నిజామాబాద్‌ వచ్చి వెళ్తున్న సమయంలో వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కులాలు వేరైనా అన్నా, చెల్లెలి మాదిరి ఉంటున్నారు. వారిద్దరు కలసి మెలసి ఉంటుండటంతో కొందరు చెడుగా మాట్లాడుతుండటంతో తాము అన్నా చెల్లెలం అని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు, యువతి ఈ నెల 8న నగరంలోని దుబ్బ ఏరియాలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ యువకుడు బుధవారం మృతి చెందాడు.

వివరాలిలా ఉన్నాయి. నందిపేట్‌ మండలం దత్తాపూర్‌ గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌(22) నిజామాబాద్‌లో డీఎల్‌ఎంటీ కోర్సు చేస్తున్నాడు. ఆదే మండలంలోని తొండపూర్‌ గ్రామానికి చెందిన ఓ బాలిక (17) జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్‌ చదువుతోంది. రోజూ నగరానికి వచ్చి వెళ్తున్న సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అన్నా చెల్లెలిలా ఉంటున్నారు. అయితే కొందరు మరోలా మాట్లాడుతుండటంతో వారి కుటుంబసభ్యులు అనుమానించారు.

ఈ విషయం తెలిసి తాము అవమానానికి గురౌతున్నామని లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మాది అన్నా చెల్లి బంధం అని మనస్ఫూర్తిగా చెబుతున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు ఎస్సై భాస్కరచారి తెలిపారు. మృతుడి తండ్రి పుట్ట గంగాధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

చదవండి: (టీఎన్‌పీఎస్సీ కోచింగ్‌.. ఒంటరిగా ఉన్న సంతోష్‌ ప్రియపై లైంగికదాడి చేసి..)

మరిన్ని వార్తలు