విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..

24 Apr, 2022 10:42 IST|Sakshi
సంధ్య (ఫైల్‌)

ఖానాపురం (వరంగల్‌ రూరల్‌): వ్యవసాయ భూమి అమ్ముడు పోక పోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మర్నాగిబోడుతండాలో శనివారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు ఈర్య, భద్రిల చిన్నకుమార్తె సంధ్య (19) నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతుంది.

ఈ క్రమంలో వివాహం కోసమని సంబంధాలు వస్తున్నాయి. తనకున్న మూడు ఎకరాల భూమిని విక్రయించి వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ సదరు భూమికి పట్టాలేకపోవడంతో ఎవరూ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన సంధ్య జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. మృతురాలి తండ్రి ఈర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ కుమారస్వామి తెలిపారు. కుమార్తె మరణంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.

చదవండి: (సెల్‌ఫోన్‌లో మగవాళ్లతో ఎక్కువ మాట్లాడుతోందని...)

►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు