వరుడికి చేరిన ప్రైవేటు ఫొటోలు.. అవమానంతో యువతి ఆత్మహత్య

8 Aug, 2021 04:03 IST|Sakshi
యువతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ

ప్రేమించిన యువకుడు అల్లరిపెట్టడంతో బలవన్మరణం

టెక్కలి రూరల్‌ (శ్రీకాకుళం): ప్రేమించానని మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకోమంటే కులాన్ని సాకుగా చూపి మొహం చాటేశాడు. పెద్దల బలవంతంతో ఆ యువతి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడగా.. ఆమె ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి పాల్జేశాడు. దీంతో అవమాన భారాన్ని దిగమింగుకోలేక ఆ యువతి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన లీలావతి (25) తల్లిదండ్రులతో కలిసి టెక్కలిలో తన అక్క ఇంట్లో ఉంటోంది.

లీలావతి అదే మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన పైల వెంకటేష్‌ అనే యువకుడిని ఐదేళ్ల క్రితం ప్రేమించింది. వివాహం చేసుకోవాలని కోరగా.. కులం పేరు చెప్పి వెంకటేష్‌ పెళ్లికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తల్లిదండ్రులు వేరే యువకుడిని పెళ్లి చేసుకునేలా లీలావతిని ఒప్పించారు. ఆగస్టు 26న పెళ్లి కూడా నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన వెంకటేష్‌ ఆ యువతికి సంబంధించి కొన్ని ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి చేశాడు. ఈ విషయం తెలిసిన లీలావతి అవమాన భారం తట్టుకోలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌ కొక్కేనికి ప్లాస్టిక్‌ వైరుతో ఉరి వేసుకుంది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు